
భారత జవాన్‌ను తిరిగి అప్పగించిన పాక్
పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ దళాలు ఉగ్రవాదులను వేటాడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో BSF జవాన్ పూర్ణచంద్ర కుమార్ షాను పాకిస్తాన్ అదుపులోకి తీసుకుంది. తాజాగా పాక్ రేంజర్లు పూర్ణచంద్ర కుమార్‌ను భారత్‌కు అప్పగించారు. అటారీ-వాఘా బోర్డర్ ద్వారా మనదేశానికి పంపారు. తన భర్త తిరిగొచ్చేలా చూడాలని ఆయన భార్య ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరగా.. దీంతో కేంద్రం పాకిస్తాన్‌తో చర్చలు జరిపి జవాన్‌ను స్వదేశానికి తీసుకువచ్చింది.