బొగ్గు గనుల వేలాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 18న సింగరేణి భవన్ ముందు తలపెట్టిన ధర్నాను కార్మికులు విజయవంతం చేయాలని సీఐటీయూ రాష్ట్ర నాయకులు నాగరాజు గోపాల్ పిలుపునిచ్చారు. మంగళవారం మందమర్రి ఏరియాలోని కేకే 5 గని, ఏరియా వర్క్ షాప్ లో నిర్వహించిన గేట్ మీటింగ్ లలో ఆయన మాట్లాడారు. మందమర్రిలోని శ్రావణపల్లి గని వేలంపాటను రద్దు చేయాలని, తెలంగాణలోని బొగ్గు బ్లాకుల సింగరేణికి అప్పగించాలని డిమాండ్ చేశారు