ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని ధర్నా

85చూసినవారు
చెన్నూర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని శనివారం బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ పెద్దపెల్లి పార్లమెంట్ కన్వీనర్ నగునూరి వెంకటేశ్వర గౌడ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్మించిన 30 పడకల ఆసుపత్రిలో కనీస వసతులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ఆసుపత్రిలో ఎక్స్ రే, సిటీ స్కాన్ ఏర్పాటు చేసి డయాలసిస్ అందరికీ అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్