వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ

55చూసినవారు
వన మహోత్సవంలో భాగంగా మొక్కలు పంపిణీ
వజ్ర వన మహోత్సవంలో భాగంగా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని రెండో వార్డులో గురువారం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని జ్యోతి నగర్, తిలక్ నగర్, కనకదుర్గ కాలనీలలో కౌన్సిలర్ పుల్లూరి సుధాకర్ ఇంటింటికీ వెళ్లి మొక్కలు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మానవాళి మనుగడ, పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంతో దోహపడుతాయన్నారు. ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కోరారు.

సంబంధిత పోస్ట్