కోటపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం

74చూసినవారు
కోటపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం
కోటపల్లి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గిరిజనేతరుల పోడు భూములలో గతంలో మాదిరిగా వ్యవసాయం చేసుకోవాలని, కోటపల్లి నుండి పారుపల్లి, పారుపల్లి నుండి లింగన్నపేట వరకు తారు రోడ్డు నిర్మించాలని, మోడల్ స్కూల్ లో అదనపు గదులు, సర్వాయిపేట- నాగంపేట మార్గంలో కొండంపేటకు వెళ్లేందుకు కల్వర్డ్స్, కంకర రోడ్డు నిర్మించాలని తీర్మానించారు.

సంబంధిత పోస్ట్