కేబుల్ చోరీకి యత్నించిన ముగ్గురు వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించినట్లు సెక్యూరిటీ అధికారి జక్కారెడ్డి మంగళవారం తెలిపారు. జైపూర్ మండలంలోని ఇందారం ఐ కే 1ఎ గనిలో పంపు రిపేర్ నిమిత్తం స్థానిక చెక్ పోస్ట్ ముందు ఉంచిన కేబుల్ ను దొంగిలించేందుకు ప్రయత్నించిన దొరగారి పల్లెకి చెందిన పులి భరద్వాజ్, బడుగు ప్రశాంత్, సొతుకు మల్లేష్లను పట్టుకున్నట్టు వెల్లడించారు.