
అగ్ని ప్రమాదం.. నిద్రలోనే ప్రాణాలు విడిచారు!
TG: హైదరాబాద్ నగరంలోని చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది చనిపోయారు. అయితే తెల్లవారుజామున ప్రమాదం సంభవించడంతో కొంతమంది నిద్రలో ప్రాణాలు విడిచారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, 8 మంది చిన్నారులు కూడా ఉన్నారు. కాగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉంది.