తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థలో పనిచేస్తున్న సాయికిరణ్ ఉత్తమ ప్లాంటేషన్ వాచర్ గా ఎంపికయ్యారు. ఆ సంస్థ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని రాష్ట్రస్థాయిలో డివిజన్ల వారీగా ప్రకటించిన జాబితాలో కాగజ్ నగర్ డివిజన్ మంచిర్యాల రేంజ్ నుంచి సాయికిరణ్ 10 సంవత్సరాలుగా ప్లాంటేషన్లను రక్షిస్తూ ఉత్తమ పనితీరును ప్రదర్శించినందుకు గాను ఈ అవార్డు అందుకున్నారు.