తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల బోర్డు చైర్మన్ గా ఐఎన్టీయూసి సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ బుధవారం హైదరాబాద్ లో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియాలోని ఐఎన్టీయూసి సీనియర్ నాయకులు ఐరెడ్డి తిరుపతిరెడ్డి, మహేందర్, భాను, ఏరియా సెక్రటరీ సాగర్ పటేల్ జక్కుల, తదితరులు జనక్ ప్రసాద్ ను సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.