

సరిహద్దు గ్రామాల్లోని ప్రజలకు ఆర్మీ సాయం (వీడియో)
జమ్మూకశ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో నియంత్రణ రేఖ (LoC)కు సమీపంగా ఉన్న గ్రామాలను ఇండియన్ ఆర్మీ సందర్శించింది. పాకిస్థాన్ షెల్లింగ్‌లో తీవ్రంగా ప్రభావిత ప్రాంతాల్లో భారత సైన్యం ఇంటింటికీ తిరిగి సహాయం అందిస్తోంది. బాధిత గ్రామాల్లో సైనికులు ప్రజలకు ఔషధాలు, రేషన్ పంపిణీ చేయడంతో పాటు స్థానికులతో మాట్లాడి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మీ వెంట ఇండియన్ ఆర్మీ ఉందని అక్కడి ప్రజలకి భరోసా ఇస్తున్నారు.