క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని రామకృష్ణాపూర్ పట్టణంలో గురువారం మహాత్మ జ్యోతిబా పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక రాజీవ్ చౌక్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.