రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తి సాధించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సింగరేణి కార్పోరేట్ జిఎం సేఫ్టీ చింతల శ్రీనివాస్ సూచించారు. మందమర్రి ఏరియాలోని కేకే ఓసీని బుధవారం ఆయన సందర్శించారు. గనిలోని పని స్థలాలను సందర్శించి సంబంధిత అధికారులకు పలు సలహాలు, సూచనలు చేశారు. అనంతరం గని మ్యాపును పరిశీలించారు. గనిలో చేపడుతున్న రక్షణ చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.