మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామంలో శనివారం భక్తులు గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని హనుమాన్ టెంపుల్ నుండి బయలుదేరి ఋష్యమూక పర్వతం చుట్టూ గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నైవేద్యాలు సమర్పించిమొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.