మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీ నగర్ లో ఓఇంట్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు గురువారం దాడి చేశారు. పేకాట ఆడుతున్న మొత్తం ఐదుగురు వ్యక్తులలో జూకంటి సాగర్, నెల్లూరు నాగరాజు లను అదుపులోకి తీసుకోగా బాకం రవి, సంతోష్, సురేష్ లు పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుంచి నుండి రూ. 9400నగదు, 03 మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకొని సీజ్ చేసినట్లు మందమర్రి ఎస్సై రాజశేఖర్ తెలిపారు.