
కాకాణి కనిపిస్తే అరెస్ట్.. పోలీసుల ప్లాన్ ఇదే
AP: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చుట్టూ పోలీసులు ఉచ్చు బిగిస్తున్నారు. విచారణకు హాజరుకాకపోవడంతో ఇక లాభం లేదని ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. దాంతో ఆయన విదేశాలకు పారిపోకుండా ఎయిర్‌పోర్టుల్లోనే అడ్డుకోవచ్చని పోలీసులు ప్లాన్ చేస్తున్నారట. కాకాణి కోసం దాదాపు 7 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఏపీతో పాటు హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో గాలిస్తున్నారు. కాకాణి కనిపిస్తే అరెస్ట్ చేయనున్నారు.