మందమర్రి మండలంలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఏఈ పేర్కొన్నారు. అందుగుల పేట గ్రామంలోని సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా శనివారం పట్టణంతోపాటు అందుగుల పేట, పులిమడుగు బొక్కలగుట్ట గ్రామాల్లో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్ వినియోగదారులు అంతరాయానికి సహకరించాలని కోరారు.