
రామయ్య స్ఫూర్తిని కొనసాగిద్దాం: డిప్యూటీ సీఎం పవన్
AP: ‘పర్యావరణ పరిరక్షణ కోసం ఆరు దశాబ్దాలుగా అలుపెరగని కృషి చేసిన పర్యావరణ ప్రేమికుడు, పద్మశ్రీ వనజీవి రామయ్య’ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రామయ్య మృతిపై కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తూ.. పచ్చదనం పెంపునకు కృషి చేద్దామని పవన్ అన్నారు.