మందమర్రి: రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని విడనాడాలి

1చూసినవారు
రౌడీ షీటర్లు నేర ప్రవృత్తిని విడనాడి సమాజంలో మంచి పౌరులుగా జీవించాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్ సూచించారు. శనివారం మందమర్రి సర్కిల్ కార్యాలయంలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తన తో మెలగకపోతే కఠినమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. సంపూర్ణమైన మార్పు వస్తే ఉన్నతాధికారుల సూచనలు మేరకు రౌడీ షీట్ ను తొలగించే విషయాన్ని పరిశీలిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్