కొత్త సంవత్సరంలో సింగరేణి ఉద్యోగులు ఉత్సాహంతో పనిచేసి సంస్థ అభివృద్ధికి దోహదపడాలని మందమర్రి ఏరియా జిఎం దేవేందర్ సూచించారు. ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు. ఉద్యోగులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలువురు జిఎం కార్యాలయ ఉద్యోగులకు ఉద్యోగన్నతి పత్రాలను అందజేశారు.