మందమర్రి ఏరియాలోని కేకే 5 గరనిలో మంగళవారం మొదటి షిఫ్ట్ లో జరిగిన ప్రమాదంలో శివ సాయి అనే బదిలీ కార్మికుడికి గాయాలయ్యాయి. భూగర్భంలో బొగ్గును వెలికి తీసుకొని వచ్చేందుకు వినియోగించే టబ్బులు కింద పడగా వాటిని లేపుతూ సరి చేసే సమయంలో శివసాయి చెయ్యి టబ్బు కింద పడడంతో ఉంగరం వేలు తెగిపోయింది. తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితుడిని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు.