ఈనెల 9 దిన కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సార్వత్తక సంఘం విజయవంతం చేయాలని సిఐటియు నాయకులు వెంకటస్వామి తెలిపారు. రామకృష్ణాపూర్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వస్తున్న నాలుగు లేబర్ కోడులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు పట్టణ నాయకులు పాల్గొన్నారు.