జైపూర్: అమరుల త్యాగాలు వెలకట్టలేనివి... డీసీపీ భాస్కరరావు

65చూసినవారు
జైపూర్: అమరుల త్యాగాలు వెలకట్టలేనివి... డీసీపీ భాస్కరరావు
పోలీస్ అమరుల త్యాగాలు వెలకట్టలేనివని మంచిర్యాల డిసిపి భాస్కరరావు అన్నారు. పోలీస్ అమరుల వారోత్సవాలను పురస్కరించుకొని గురువారం జైపూర్ సింగరేణి విద్యుత్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. సిఐఎస్ఎఫ్ జవాన్లతో పాటు పోలీసులు, వివిధ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువత, తదితరులతో కలిసి సుమారు 250 మంది రక్తదానం చేశారు.

సంబంధిత పోస్ట్