జైపూర్ మండల కేంద్రంలో జరుగుతున్న సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వేను మండల ప్రత్యేక అధికారి గణపతి శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బ్లాక్ వారీగా ఎన్యుమరేటర్ ప్రతీ ఇంటిలో నిర్వహిస్తున్న సర్వే తీరును పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఎలాంటి తప్పులు దొర్లకుండా సమర్థవంతంగా కుటుంబ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాపురావు, తదితరులు పాల్గొన్నారు.