జన్నారం మండల అదనపు ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న రాథోడ్ తానాజీ నాయక్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందాడు. ఉట్నూర్ మండల కేంద్రంలో కుటుంభ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జ్ ఆత్రం సుగుణక్క వారి నివాసనికి వెళ్లి పార్థీవదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.