దండేపల్లి మండలం రాజుగూడ గ్రామపంచాయతీ పరిధిలోని జైతుగూడ గ్రామానికి చెందిన మార్నేని మైసయ్య ఆనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన మాజీ వైస్ యంపిపి ఆకుల రాజేందర్ శుక్రవారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.5000 ఆర్థిక సహాయం అందజేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మర్సుకొల్ల లచ్చు పటేల్, మాజీ ఉపసర్పంచులు బట్టు రాజయ్య, నాయకులు మాడ దయాకర్, ఆడాయి శంకర్, తదితరులు పాల్గొన్నారు.