మంచిర్యాల జిల్లా ఆటో జేఎసీ నాయకుడు రాము కుమార్ టాప్ నంబర్ లేని ఆటో డ్రైవర్లు ప్రయాణికుల నుంచి అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. బెల్లంపల్లికి రావాల్సిన రైళ్లు మంచిర్యాలలో హాల్టింగ్ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి కేవలం రూ. 70 తీసుకోవాలని ఆటో డ్రైవర్లకు మంగళవారం సూచించారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తే యూనియన్ దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.