పిల్లల సంక్షేమం కోసం ప్రభుత్వం అమ్మ మాట అంగన్ వాడీ బాట కార్యక్రమం నిర్వహిస్తుందని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార దీపక్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల్లో వారానికి రెండుసార్లు ఎగ్ బిర్యానీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అంగన్వాడి కేంద్రాల్లో పోషకాహారతో కూడిన పదార్థాలను లబ్ధిదారులకు అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.