బెల్లంపల్లి మండలం అకెనపల్లి గ్రామపంచాయతీలో భూభారతి రెవెన్యూ సదస్సు సోమవారం నిర్వహించారు. తహశీల్దార్ కృష్ణ రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరించారు. రైతుల భూ సమస్యలు పరిష్కరించేందుకే భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.