మానవతను చాటుకున్న సీఐ

83చూసినవారు
మానవతను చాటుకున్న సీఐ
మతిస్థిమితం లేని ఓ మహిళను చెన్నూర్ పట్టణ సీఐ రవీందర్ అనాథాశ్రమంలో చేర్పించి మానవతను చాటుకున్నారు. కొన్ని రోజుల నుండి ఆ మహిళ భిక్షాటన చేస్తూ భిక్షాటన చేస్తూ దీనస్థితిలో జీవనం సాగిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సీఐ రవీందర్ ఆ మహిళ గురించి ఆరా తీయగా ఎవరూ స్పందించ లేదు. దీంతో ఆమెను సీఐ స్వయంగా మంచిర్యాలలోని కల్వరి యువశక్తి ఆనాధాశ్రమంలో చేర్పించారు. ఈ సందర్భంగా సీఐ స్పందించిన తీరుపై హర్షం వ్యక్తమవుతోంది.

సంబంధిత పోస్ట్