దండేపల్లి మండలంలోని ఊట్ల అటవీ ప్రాంతం సమీపంలో అక్రమంగా తరలిస్తున్న కలపను పట్టుకున్నట్లు డిఆర్ఓ పోచమల్లు మంగళవారం తెలిపారు. గుండాల నుంచి ద్విచక్ర వాహనంపై టేకు దుంగలను తరలిస్తుండగా ఎఫ్ బీ ఓ సాయి, బేస్ క్యాంప్ సిబ్బంది పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. కలప 33 వేల విలువ చేస్తుందన్నారు. కలపను, బైకును తాళ్లపేట రేంజి కార్యాలయానికి తరలించినట్లు తెలిపారు.