కల్లు గీత కార్మికులకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా అందజేస్తున్న కాటమయ్య రక్షణ కిట్టు ఎంతో ఉపయోగకరమని మంచిర్యాల జిల్లా జాయింట్ కలెక్టర్ మోతిలాల్ తెలిపారు. మంగళవారం దండేపల్లి మండలం నర్సాపూర్ గ్రామంలో బీసీ సంక్షేమ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాటమయ్య రక్షణ కిట్టు పంపిణీ, శిక్షణ కార్యక్రమంలోఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కిట్ల ద్వారా గీతా కార్మికులు తమ పని సులువు చేయించుకోవచ్చని సూచించారు.