ప్రతి ఒక్కరూ బ్యాంకు ఖాతా కలిగి ఉండాలని దండేపల్లి మండలంలోని తాళ్లపేట ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ్, సిఎఫ్ఎల్ కౌన్సిలర్ రవీందర్, డాక్టర్ చంద్రకాంత్ సూచించారు. శుక్రవారం దండేపల్లి మండలంలోని తాళ్లపేట గ్రామ ప్రభుత్వాసుపత్రిలో పనిచేసే సిబ్బందికి, ప్రజలకు ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా డిజిటల్ పేమెంట్స్ పై అవగాహన పెంచుకోవాలని వారు సూచించారు.