బ్యాంకు సేవలను ప్రజలు వినియోగించుకోవాలని దండేపల్లి మండలంలోని తాళ్లపేట SBI బ్యాంక్ మేనేజర్ శ్రీనాథ్, కౌన్సిలర్ రవీందర్ అన్నారు. దండేపల్లి మండలంలోని ధర్మరావుపేటలో CFL ఆధ్వర్యంలో ఈజీఎస్ కూలీలకు ఆర్థిక అక్షరాస్యతపై గురువారం అవగాహన కల్పించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రజలు డిజిటల్ పేమెంట్లపై ఆసక్తిని పెంచుకోవాలన్నారు.