

మహిళ మెడలో పుస్తెలతాడును తెంపుకుపోయిన దొంగ (వీడియో)
TG: చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని అల్కాపురి టౌన్ షిప్లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ మెడలోని పుస్తెలతాడును ఓ యువకుడు ఇవాళ తెంపుకొని పారిపోయాడు. ఈ క్రమంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.