మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ ఐపీఎస్ కేడర్ లోకి మారారు. 2019 బ్యాచ్ గ్రూప్-1 అధికారిగా పోలీసు శాఖలో చేరిన ఆయన స్టేట్ సర్వీస్ పూర్తి చేసుకున్నారు. దీంతో యూపీఎస్సీ ఐపీఎస్ హోదాను కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఐపీఎస్ హోదాలోనే మంచిర్యాల డీసీపీగా విధులు నిర్వర్తించేందుకు అవకాశం కల్పించింది. డీసీపీ భాస్కర్ కు ఐపీఎస్ హోదా రావడంతో జిల్లా పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.