పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని ధర్నా

67చూసినవారు
మంచిర్యాలలోని హమాలివాడలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో కనీస వసతులు కల్పించాలని శనివారం విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో ఒక్క ఉపాధ్యాయుడు మాత్రమే ఉండడంతో విద్యార్థులకు సరైన బోధన జరగడం లేదన్నారు. తాగునీరు, బాత్రూంలు లేక విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్