ఐఎన్టీయూసి జాతీయ అధ్యక్షులు డా. జి. సంజీవ రెడ్డిని శనివారం తెలంగాణ రాష్ట్ర కనీస వేతన సలహా మండలి చైర్మన్, యూనియన్ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా సింగరేణిలో యూనియన్ బలోపేతానికి తీసుకోవలసిన చర్యలు, జాతీయ, ఉమ్మడి రాష్ట్రాల ఐఎన్టీయూసి వర్కింగ్ కమిటీ సమావేశం, జాతీయ ఐఎన్టీయూసి వర్కింగ్ కమిటీ సమావేశం, కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ కార్మికుల జీతాల పెంపుపై వారు చర్చించారు.