సింగరేణిలో దీపావళి పండుగ బోనస్ రూ. 93, 750 ఈ నెల 25న కార్మికులు, ఉద్యోగులకు చెల్లించడానికి యాజమాన్యం నిర్ణయించింది. ఈ నెల 31న దీపావళి పండుగ సందర్భంగా కార్మికులకు బోనస్ చెల్లించాలని తాము కోరిన మేరకు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు గుర్తింపు సంఘం ఏఐటీయుసి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ తెలిపారు.