మంచిర్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిని పట్టుకున్నారు. వీరిని కోర్టులో హాజరుపరచగా జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిరోషా ఎనిమిది మందికి వారం రోజుల పాటు జైలు శిక్ష, పదిమందికి ట్రాఫిక్ విధులు నిర్వహించాలని శిక్ష విధించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.