మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ హాస్పిటల్ లో ఆదివారం ఉచిత ఆర్థో వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు శనివారం తెలిపారు. ఈ శిబిరంలో ప్రఖ్యాత సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వంశీకృష్ణ మోకాలు, భుజం, మడమ, కీళ్ల నొప్పులు, ఎముకల అరుగుదలకు సంబంధించిన పరీక్షలు ఉచితంగా చేస్తారని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.