దండేపల్లి మండలంలోని శ్రీ గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి దేవాలయంలో హుండీలను లెక్కించామని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. గత మార్చి 17 నుండి జూన్ 11 వరకు హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. దీనికి సంబంధించి హుండీల ద్వారా రూ. 8, 45, 873 ఆదాయం వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, దేవాలయ సిబ్బంది, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.