చట్టాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన ఉండాలని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి అర్పితా మారం రెడ్డి అన్నారు. బాల వివాహ ముక్త్ భారత్ నినాదంతో బాల్య వివాహాల నిర్మూలనలో భాగంగా మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాయి కుంట జడ్పిహెచ్ఎస్ లో బుధవారం విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ అడిషనల్ కౌన్సిల్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.