మంచిర్యాల: చట్టాలపై విద్యార్థులకు అవగాహన

67చూసినవారు
మంచిర్యాల: చట్టాలపై విద్యార్థులకు అవగాహన
మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి అర్పిత మారంరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు బయట పని చేయకుండా శ్రద్ధగా చదువుకొని దేశ అభివృద్దికి పాటుపడాలని సూచించారు. బాల కార్మిక, విద్యా హక్కు, మోటార్ వాహన చట్టాల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించారు. న్యాయ సహాయం కోసం 15100 నంబర్ కు ఫోన్ చేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్