హాజీపూర్ మండలం గడ్ పూరుకు చెందిన సల్లం రాయపోసు అనే మహిళ తునికాకు సేకరణ కోసం వెళ్లి తీవ్ర అస్వస్థతకు గురైంది. కుటుంబ సభ్యులు ఆమెను మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించినట్లు బాధిత కుటుంబ సభ్యులు మంగళవారం తెలిపారు.