మంచిర్యాల ట్రాఫిక్ ఏఎస్సై రామరాజు నిజాయితి చాటుకున్నారు. గురువారం స్థానిక బెల్లంపల్లి చౌరస్తాలో విధులు నిర్వహిస్తుండగా రోడ్డుపై ఒక పర్సు దొరికింది. అందులో ఉన్న గుర్తింపు కార్డు సహాయంతో విచారణ జరిపి తిలక్ నగర్ కు చెందిన సౌడం హరీష్ పర్సుగా గుర్తించారు. వెంటనే అతడిని ట్రాఫిక్ పోలీసు స్టేషన్ కు పిలిపించి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ సమక్షంలో తిరిగి అప్పగించారు.