ఆదిలాబాద్ కు మరోసారి అన్యాయం: ఎమ్మెల్యే

72చూసినవారు
మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంపై మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పందించారు. ఉమ్మడి ఆదిలాబాద్ కు మరోసారి అన్యాయం జరిగిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో జిల్లాది కీలక పాత్ర అని చెప్పారు. అధిష్ఠానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా, త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. కానీ అప్పటివరకు కార్యకర్తలు సంయమనం పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్