విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు పునాది ప్రభుత్వ పాఠశాలలని జన్నారం మండలంలోని కలమడుగు జడ్పీ పాఠశాల హెచ్ఎం కట్ట రాజమౌళి అన్నారు. ఆదివారం జన్నారం మండలంలోని చింతలపల్లి, లింగాయపల్లి గ్రామాల్లో ఉపాధ్యాయులతో కలిసి బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల్లో కల్పిస్తున్న సౌకర్యాల గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ముత్య తిరుపతి, ముల్కా తిరుపతి రమేష్ పాల్గొన్నారు.