కోప్టా చట్టంలోని సవరణలతో బీడి పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని సీఐటీయు మంచిర్యాల జిల్లా కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. ఆదివారం జన్నారంలోని సీఐటీయు కార్యాలయంలో నాయకులు, బీడీ మహిళా కార్మికులతో సమావేశం నిర్వహించారు. బీడీ పరిశ్రమపై తెలంగాణలో ఏడు లక్షల మంది ఉపాధి పొందుతున్నారని, కోప్టా చట్టంలోని సవరణలతో బీడీ పరిశ్రమకు, కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు.