బీజేవైఎం జన్నారం మండల అధ్యక్షుడు ముడుగు ప్రవీణ్ ప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆయన గురువారం జన్నారంలో మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినప్పటికీ, బస్సు పాస్ చార్జీలను పెంచడం సరైంది కాదని విమర్శించారు. ఇది సామాన్య ప్రజలు, విద్యార్థులపై ఆర్ధిక భారం మోపుతుందని పేర్కొన్నారు.