జన్నారం: ఈజీఎస్ పనులను అనుసంధానిస్తేనే ఉపాధి

77చూసినవారు
జన్నారం: ఈజీఎస్ పనులను అనుసంధానిస్తేనే ఉపాధి
వానాకాలం సీజన్లో వ్యవసాయానికి ఈజీఎస్ పనులను అనుసంధానిస్తేనే తమకు ఉపాధి దొరుకుతుందని జన్నారం మండలంలోని పలు గ్రామాల ఉపాధి హామీ కూలీలు అన్నారు. మండలంలోని పలు గ్రామాల శివారులలో చేపట్టిన ఉపాధి హామీ పనులు చివరి దశకు చేరుకుంటున్నాయి. భారీ వర్షాలు ప్రారంభమైతే తమకు ఉపాధి ఉండదని, ఆదాయం రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా ఉంటుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్